Madanapalle: దుర్గామాతను దర్శించుకున్న వైఎస్సార్‌సీపీ యువనేత హర్ష!

Madanapalle: మదనపల్లె రామారావు కాలనీలో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 12 Oct 2026 11:54 PM IST
Madanapalle
X

Madanapalle: దుర్గామాతను దర్శించుకున్న వైఎస్సార్‌సీపీ యువనేత హర్ష!

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీలో దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గామాత ను మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) దర్శించుకున్నారు. సుధ, వేణు ఆహ్వానం మేరకు ఆయన అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు హర్షవర్ధన్ రెడ్డికి అమ్మవారి కండువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా (హర్ష) మాట్లాడుతూ, దసరా నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలని, దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle