Ramapuram: మండలంలో శివాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి మండిపల్లి!

Ramapuram: రాయచోటి రామాపురం మండలం మన్నేరువాండ్లపల్లెలో రూ.20 లక్షలతో నిర్మించనున్న శివాలయానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 28 Aug 2026 12:18 PM IST
Ramapuram
X

Ramapuram: మండలంలో శివాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి మండిపల్లి!

Ramapuram: మండలం మన్నేరువాండ్లపల్లెలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శివాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న శివాలయం నిర్మాణం త్వరలో పూర్తై భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని ఆకాంక్షించారు.

ప్రజా సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న గ్రామస్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story