Annamayya: గాండ్లపల్లెలో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం

Annamayya: అన్నమయ్య జిల్లా గాండ్లపల్లెలో చెరువు అభివృద్ధి పనులను మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభించారు. పనులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Aug 2026 10:08 AM IST
Annamayya
X

Annamayya: గాండ్లపల్లెలో చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం

గాండ్లపల్లెలో చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న శ్రీ మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి..

రాయచోటి, అన్నమయ్య జిల్లా

చిన్నమండెం మండలం వండాడి గ్రామం గాండ్లపల్లెలో చేపట్టనున్న చెరువు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి కుమారుడు శ్రీ మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించిన నిశ్చల్ నాగిరెడ్డి గ్రామీణాభివృద్ధికి దోహదపడే ప్రతి పనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చెరువు అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం సాగునీటి వసతులు మెరుగుపడటంతో పాటు రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మండల అధ్యక్షులు రెడ్డప్ప మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి గ్రామ అధ్యక్షులు బాబు రెడ్డి గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story