Rayachoti: రామాపురంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఏడుగురు ముఖ్య నేతలు!
Rayachoti: రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం చిట్లూరి పరిధిలోని ఏకలపల్లెకు చెందిన ఏడుగురు వైసీపీ ముఖ్య నేతలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
Rayachoti: రామాపురంలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి ఏడుగురు ముఖ్య నేతలు!
రాయచోటి: రామాపురం మండలం చిట్లూరి గ్రామ పరిధిలోని ఏకలపల్లెకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు నారాయణరెడ్డి, చలమారెడ్డి, భాస్కర్ రెడ్డి, భాస్కర్ నాయుడు తదితర సుమారు ఏడుగురు నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.




