Rayachoti: నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ ధీరజ్!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రామాపురం మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Rayachoti: నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ ధీరజ్!
రాయచోటి: లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, రామాపురం మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం కేంద్రాల వద్ద 100 మీటర్ల నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
అభ్యర్థుల వెంట పరిమితికి మించి అనుచరులు రాకుండా నియంత్రించాలని పోలీసు సిబ్బందికి స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకారం అందించాలని కోరారు.




