Rayachoti: గ్రామాల్లో రాత్రి బస ప్రజా భద్రతపై అన్నమయ్య జిల్లా పోలీసుల అవగాహన!

Rayachoti: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో గ్రామాల్లో రాత్రి బస చేస్తున్న పోలీసులు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, వినాయక చవితి నిబంధనలపై అవగాహన.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 6 Sept 2026 8:05 AM IST
Rayachoti
X

Rayachoti: గ్రామాల్లో రాత్రి బస ప్రజా భద్రతపై అన్నమయ్య జిల్లా పోలీసుల అవగాహన!

Rayachoti: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారి ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.

మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలనతో పాటు హెల్మెట్ వాడకం, రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యపరుస్తున్నారు.

రాబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై కమిటీలకు సూచనలు చేయడంతో పాటు, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం ఉండేలా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు.

నేర రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story