Annamayya: లక్కిరెడ్డిపల్లిలో దారుణం భార్యను రోకలితో కొట్టి చంపిన భర్త

Annamayya: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాపుపల్లెలో భార్యను రోకలితో కొట్టి హత్య చేసిన భర్త. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరత్న మృతి; నిందితుడు పరారీ.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 8 Oct 2026 1:57 PM IST
Annamayya
X

Annamayya: లక్కిరెడ్డిపల్లిలో దారుణం భార్యను రోకలితో కొట్టి చంపిన భర్త

Annamayya: అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కాపుపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దేరేంగుల నరసింహులు బుధవారం సాయంత్రం తన భార్య దేరేంగుల నాగరత్నతో గొడవపడి రోకలిబండతో ఆమె తలపై దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన నాగరత్నను స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది.

మృతురాలు నాగరత్నకు నరసింహులుకు నలుగురు పిల్లలు—ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం నరసింహులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు తరచూ గొడవపడేవారని స్థానికులు పేర్కొన్నారు. ఘటనపై లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI