Rayachoti: అన్నమయ్య జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆవుల!
Rayachoti: అన్నమయ్య జెడ్పీ చైర్పర్సన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆవుల మల్లికార్జున రెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Rayachoti: అన్నమయ్య జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆవుల!
Rayachoti: రాయచోటిప్రాంతానికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆవుల మల్లికార్జున రెడ్డిని ఎంపిక చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, చైర్పర్సన్ అభ్యర్థి ఆవుల మల్లికార్జున రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం తిరుపతిలో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పీవీ మిథున్ రెడ్డిని గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆవుల మల్లికార్జున రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతున్న ఆవుల కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం హర్షణీయమన్నారు. రాయచోటి ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ కీలక అవకాశం కల్పించడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.అయితే, రాయచోటి నియోజక వర్గంలో తాము నమ్ముకున్న కొంతమంది వ్యక్తులు పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ నుంచి వైదొలగడం దురదృష్టకరమన్నారు.
అన్నమయ్య జిల్లాలో అత్యధిక జెడ్పీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
ఏడుదశాబ్దాల రాజకీయ వారసత్వం.. ప్రజాసేవే లక్ష్యంగా ఆవుల మల్లికార్జున రెడ్డి ప్రస్థానం! విద్య,వ్యాపారఅనుభవంతో పాటు రాజకీయ నేపథ్యం.. ప్రజలతో సుదీర్ఘ అనుబంధం! పెద్దమండెం జెడ్పీటీసీ అభ్యర్థిగా ఆవుల మల్లికార్జున రెడ్డి ఆవులమల్లికార్జున రెడ్డి – ఏడు దశాబ్దాల రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు ఆవుల మల్లికార్జున రెడ్డి విద్యావంతుడు,వ్యాపారవేత్తగా గుర్తింపు పొందడంతో పాటు, ఏడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి.
ఆయన తాతగారైన ఆవుల కొండారెడ్డి గారు పదేళ్ల పాటు సమితి అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు, ఎల్ఎన్బీ బ్యాంక్ ఛైర్మన్గా సేవలందించారు. ఆయన అన్నయ్య ఆవుల విష్ణు వర్ధన్ రెడ్డి మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్గా పనిచేశారు. అలాగే, ఆయన వదిన మాజీ ఎంపీపీగా, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలి గా సంబేపల్లి మండలానికి సేవలందించారు.
ఆవుల కుటుంబానికి దశాబ్దాలుగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు, బలమైన రాజకీయ పునాది, ప్రజాసేవలో అనుభవం కలిగిన ఘనమైన వారసత్వం ఉంది. ఈ కుటుంబం ఉమ్మడి చిత్తూరు, ప్రస్తుత అన్నమయ్య జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. అంతేకాకుండా, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారితో ఆవుల కుటుంబానికి దీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు, బలమైన అనుబంధం కొనసాగుతోంది.
అదేవిధంగా, పెద్దిరెడ్డి గారి కుటుంబం తోనూ ఆవుల కుటుంబానికి చాలాకాలంగా సత్సంబంధాలు, రాజకీయ అనుబంధం ఉన్నాయి. ఈ సంబంధాలు కుటుంబ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.అలాగే, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న రాజకీయ సంబంధాలు ఆవుల మల్లికార్జున రెడ్డి రాజకీయ ప్రయాణానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
విద్య, వ్యాపార అనుభవం, రాజకీయ వారసత్వం, సీనియర్ నాయకులతో సత్సంబంధాలు, ప్రజలతో సన్నిహిత అనుబంధం కలగలిసిన ఆవుల మల్లికార్జున రెడ్డి పెద్దమండెం మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా ప్రజాసేవలో మరింత కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.




