Annamayya: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ పోస్టర్ విడుదల చేసిన కార్యవర్గ సభ్యులు

Annamayya: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై పోస్టర్ విడుదల.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 12 Jun 2026 11:33 AM IST
Annamayya
X

Annamayya: ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ పోస్టర్ విడుదల చేసిన కార్యవర్గ సభ్యులు

Annamayya: ఉద్యోగస్తుల సమస్యల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని ఏపీ జేఏసీ అమరావతి అన్నమయ్య జిల్లా చైర్మన్ నరసింహ కుమార్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏపీ జేఏసీ అమరావతి అన్నమయ్య జిల్లా కార్యవర్గం సమావేశం అయ్యింది. ఉద్యోగస్తుల సమస్యల సాధన కోసం పోరాడాల్సిన విధి విధానాల పై చర్చించారు. వాల్ పోస్టర్లు ను విడుదల చేసి ఉద్యమ కార్యచరణ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏపీ జెఏసి అమరావతి అన్నమయ్య జిల్లా చైర్మన్ నరసింహ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. పిఆర్సి కమీషనర్ ని వెంటనే నియమించి, ఐఆర్ ని తక్షణమే ప్రకటించాలని, డిఏ, పిఆర్సి, ఎస్ఎల్, తదితర బకాయిలు, పెండింగ్ డిఏ లు ను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను పునరుద్దరించాలని, కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ను రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు కూడా అమలు చేయాలని, ఉద్యోగి కి రావలసిన బకాయిలను పేస్లివ్ చూపించాలని, పొదుపు చర్యలలో భాగంగా ఉద్యోగులందరికి 5 రోజులు పనిదినాలు అమలు చేయాలని, సరెండర్ లీవ్లు ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story