Rayachoti: ఏకగ్రీవ జడ్పీటీసీ అభ్యర్థులను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: రాయచోటి నియోజకవర్గంలో 3 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం. లక్కిరెడ్డిపల్లి, రామాపురం, రాయచోటి నూతన జడ్పీటీసీలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు.
Rayachoti: ఏకగ్రీవ జడ్పీటీసీ అభ్యర్థులను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన లక్కిరెడ్డిపల్లి జడ్పీటీసీగా యనమల మదన్ మోహన్, రామాపురం జడ్పీటీసీగా పప్పిరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి సతీమణి హరిప్రియ, రాయచోటి జడ్పీటీసీగా సుధాకర్ సతీమణి లక్ష్మీ ప్రసన్నలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించారు. తమకు జడ్పీటీసీ అభ్యర్థులుగా అవకాశం కల్పించడంతో పాటు, ఏకగ్రీవ ఎన్నిక సాధించడంలో కీలక పాత్ర పోషించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగేందుకు కృషి చేస్తున్న నాయకులు, కార్యకర్తల సహకారం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, తమకు లభించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్పీటీసీలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తామని పేర్కొన్నారు.
రాయచోటి నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని, సమష్టి కృషి, నాయకత్వ సమన్వయంతో భవిష్యత్తులోనూ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు వెల్లడించారు.




