Putlampalli Sports School: క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు సువర్ణావకాశం.. రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Putlampalli Sports School: వైఎస్సార్ కడప జిల్లా పుట్లంపల్లిలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో 4 నుంచి 9వ తరగతి సీట్ల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.

S.Firoz, Sri Sathya Sai
Published on: 21 May 2026 7:34 AM IST
Putlampalli Sports School
X

Putlampalli Sports School: క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు సువర్ణావకాశం.. రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

వైఎస్సార్ కడప జిల్లా పుట్లంపల్లిలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4 నుండి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.కిషోర్ తెలిపారు.అర్హత శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన 4 నుండి 9వ తరగతి చదువుతున్న ఆసక్తి గల విద్యార్థులు.ఎంపిక విధానం 4 నుండి 6వ తరగతి విద్యార్థులకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 7 నుండి 9వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలు ఉంటాయి.చివరి తేదీ జూన్ 02, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్‌సైట్: పూర్తి వివరాలకు https://apsportsschool.ap.gov.in/ సందర్శించగలరు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story