Kadapa: కడపలో టీడీపీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం!

Kadapa: విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన ప్రవాసాంధ్రులకు ఏపీఎన్ఆర్టీ (APNRT) అండగా నిలుస్తుందని కడప లోకల్ కోఆర్డినేటర్ షేక్ రహమతుల్లా వెల్లడి.

G. RAVI KUMAR, KADAPA
Published on: 20 Sept 2026 1:26 PM IST
Kadapa
X

Kadapa: కడపలో టీడీపీ ఎన్ఆర్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం!

Kadapa: విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన ప్రవాసాంధ్రులకు APNRT అండగా నిలుస్తుందని కడప జిల్లా లోకల్ కోఆర్డినేటర్ షేక్ రహమతుల్లా తెలిపారు. కడప నగరంలోని టీడీపీ నగర NRI కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రహమతుల్లా మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లా APNRT లోకల్ కోఆర్డినేటర్‌గా తనను నియమించిన ప్రభుత్వానికి, APNRT చైర్మన్ రవికుమార్‌తో పాటు టీడీపీ అధినాయకత్వానికి రహమతుల్లా కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో ప్రతినిధులు ఉన్నారని, ఆయా దేశాల్లో వివిధ పనుల కోసం వెళ్లిన ప్రవాసులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ప్రతినిధులు మార్గదర్శకత్వం అందిస్తారని చెప్పారు.NRIలు అంటే కేవలం పెద్ద ఉద్యోగాలు, అధిక ఆదాయం ఉన్నవారు మాత్రమే కాదని.. గల్ఫ్ దేశాలకు డ్రైవర్లు, కార్మికులు, చిన్నచిన్న పనుల కోసం వెళ్లిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు.

విదేశాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, చట్టపరమైన సమస్యలు తలెత్తినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో లేదా మృతదేహాలను స్వదేశానికి తరలించాల్సిన సందర్భాల్లో APNRT ద్వారా సహాయం అందిస్తామని చెప్పారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తామన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA