Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరుకు సీఎం చంద్రబాబు పర్యటన!
Proddatur: వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ నెల 5న జరుగనున్న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, అధికారులు.
Proddatur: ఈ నెల 5న ప్రొద్దుటూరుకు సీఎం చంద్రబాబు పర్యటన!
Proddatur: ఈ నెల 5వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. సీఎం పర్యటనను జయప్రదం చేయాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నాయకత్వంలో అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, ఏఎస్పి విభూకృష్ణ, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటన ప్రాంగణాలను పరిశీలించారు.. జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని బొల్లవరం తిమ్మయ్య కళ్యాణమండపం పక్కన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వాహనాల నిలిపివేతకు మున్సిపల్ లేఅవుట్ నందు పార్కింగ్ సౌకర్యాన్ని, సమీపంలో హెలిప్యాడ్ ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా చర్యలను సమీక్షించారు. అనంతరం స్థానిక R&B గెస్ట్ హౌస్ నందు కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఏఎస్పి, మరియు వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీఎం పర్యటనను దిగ్విజయం చేయాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కోరారు.




