Atlur: అట్లూరులో వైసీపీకి షాక్: టీడీపీలోకి ప్రభాకర్ రెడ్డి

Atlur: వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు వైసీపీ మండల అధ్యక్షుడు ముడమాల ప్రభాకర్ రెడ్డి, బద్వేలు టీడీపీ ఇన్‌చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 12 Oct 2026 2:58 PM IST
Atlur
X

Atlur: అట్లూరులో వైసీపీకి షాక్: టీడీపీలోకి ప్రభాకర్ రెడ్డి

కడప జిల్లా: అట్లూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మండల అధ్యక్షుడు శ్రీ ముడమాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, కడప డీసీసీబీ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ముడమాల ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ చేరికతో బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL