CK Dinne: మద్యం మత్తులో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!

CK Dinne: సీకే దిన్నె మండలం ఇందిరానగర్‌లో విషాదం. మద్యానికి బానిసై ఆటో డ్రైవర్ హేమంత్ కుమార్ ఆత్మహత్య. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 16 Jun 2026 11:12 AM IST
CK Dinne
X

CK Dinne: మద్యం మత్తులో ఆటో డ్రైవర్ ఆత్మహత్య!

CK Dinne: సీకే దిన్నె మండల పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన హేమంత్కు మార్ (30) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ బాల మద్దిలేటి తెలిపారు. అతనికి కొన్నేళ్ల కిందట వివాహం కాగా భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇటీవల మద్యానికి బానిసై నిత్యం కుటుంబ సభ్యులను వేధిస్తు ఆదివారం మద్యం తాగి మైకంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు సీఐ చెప్పారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story