Kadapa: నిలిపిన ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో రిమ్స్‌కు క్షతగాత్రులు!
Kadapa: కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం తోలగంగనపల్లి వద్ద నిలిపిన ట్రాక్టర్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా రిమ్స్‌కు తరలించారు.
Kadapa: నిలిపిన ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో రిమ్స్‌కు క్షతగాత్రులు!
Kadapa: నిలిపిన ట్రాక్టర్‌ను ఢీకొన్న ఆటో.. ఇద్దరికి గాయాలు
వల్లూరు మండలం తోలగంగనపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం
రిమ్స్‌కు క్షతగాత్రుల తరలింపు
వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లి గ్రామ సమీపంలో కడప - తాడిపత్రి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు..
స్థానికుల వివరాల ప్రకారం. కడప వైపు నుంచి ఖాళీ రాళ్ల ట్రాక్టర్ ఎర్రగుంట్ల దిశగా ప్రయాణిస్తుండగా, తోల్లగంగనపల్లి సమీపంలో రోడ్డుపై ట్రాక్టర్‌ను నిలిపినట్లు తెలిసింది. ఆ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు సమాచారం..
అదే సమయంలో కడప నుంచి కూరగాయలు లోడ్ చేసుకుని, కొంతమంది ప్రయాణికులతో కమలాపురం వైపు వెళ్తున్న ఆటో ట్రాక్టర్ వెనుక భాగాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టింది..
ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా, ఆటోలో ఉన్న కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు..
స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.




