Badvel: ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలి: కోర్ణ నారాయణ

Badvel: గతంలో రద్దు చేసిన ముదిరాజ్ కార్పొరేషన్‌ను కూటమి ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించి ఆదుకోవాలని బద్వేలులో నిర్వహించిన సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 12 Sept 2026 5:11 PM IST
Badvel
X

Badvel: ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను వెంటనే పునరుద్ధరించాలి: కోర్ణ నారాయణ

బద్వేల్: ముదిరాజుల హక్కుల సాధన కోసం ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముదిరాజ్‌ మహాసభ మాజీ చైర్మన్‌ కోర్ణ నారాయణ ముదిరాజ్‌, కడప జిల్లా అధ్యక్షుడు ఎడవల్లి వెంకటసుబ్బయ్య ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు.

బద్వేల్‌లోని ముదిరాజు భవన్‌లో ముదిరాజ్‌ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎత్తివేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను కొనసాగిస్తున్నట్టే ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను కూడా కొనసాగించాలని కోరారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయకపోతే ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. సమావేశంలో ముదిరాజ్‌ సంఘం నాయకులు కందల నరసింహులు, శీను, గుండ్లకుంట జయరామయ్య, ఎడవల్లి గురవయ్య, మనోహర్‌, రఘు, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL