Badvel: శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి
Badvel: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలకు యూజీసీ ద్వారా స్వయం ప్రతిపత్తి హోదా. హర్షం వ్యక్తం చేసిన యాజమాన్యం, విద్యార్థులు.
Badvel: శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి
బద్వేలు: బద్వేలు నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థిని, విద్యార్థుల ఉన్నత విద్య కలలను సాకారం చేసి, బద్వేలు పట్టణానికే తలమానికమైన శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. వెంకటసుబ్బారెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు కళాశాల ప్రాంగణం బద్వేలు నాలుగు రోడ్ల కోడెల వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో ఉన్న వీరారెడ్డి విగ్రహానికి పూలమాలవేశారు.
శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల 1979 వ సంవత్సరంలో స్థాపించబడి విభిన్నమైన కోర్సులతో వేలాదిమంది విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించింది. జాతీయస్థాయిలో NAAC అక్రిడియేషన్ గుర్తింపు పొంది, నేడు U.G.C ద్వారా స్వయం ప్రతిపత్తి హోదా సాధించినట్లు ప్రిన్సిపాల్ గారు తెలియజేశారు.
యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఎన్నోసార్లు ప్రథమ స్థానంలో నిలిచి ఉమ్మడి కడప జిల్లాలో నెంబర్ వన్ విద్యాసంస్థగా గుర్తింపు పొందింది. శ్రీ బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల. యిలా కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించినందుకు శ్రీ బిజివేముల వీరారెడ్డి విద్యాసంస్థల కరస్పాండెంట్ శ్రీమతి కె.విజయమ్మ గారు కళాశాల సెక్రటరీ కె.రితేష్ రెడ్డి గారు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా బి.ఏ,బి.కాం,బి.ఎస్సీ కోర్సులలో అడ్మిషన్ల కొరకు కళాశాల కార్యాలయాన్ని సంప్రదించవలసినదిగా ప్రిన్సిపాల్ గారు తెలిపారు




