Badvel: క్లస్టర్-3 లో డిజిటల్ జోష్ ఘనంగా సాగిన టీడీపీ వర్చువల్ మహానాడు
Badvel: బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ క్లస్టర్-3 లో చెరుకూరి రవికుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా వర్చువల్ మహానాడు.
Badvel: క్లస్టర్-3 లో డిజిటల్ జోష్ ఘనంగా సాగిన టీడీపీ వర్చువల్ మహానాడు
బద్వేల్: నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలం క్లస్టర్-3 లో రెండవ రోజు చెరుకూరి రవికుమార్ నాయుడు గారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన వర్చువల్ మహానాడు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు కార్యక్రమాలు చెరుకూరి రవికుమార్ నాయుడు గారి ఆధ్వర్యం లో ఘనంగా కొనసాగాయి.
ఈ సందర్భంగా చెరుకూరి రవికుమార్ నాయుడు గారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పార్టీ లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చిస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు.
మహానాడులో యువత మరియు మహిళలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోరుమామిళ్ళ క్లస్టర్ పరిధి లో నుంచి వచ్చిన క్లస్టర్ , బూత్, యూనిట్, ఇంచార్జీలు ఈ కార్యక్రమంలో నడిపి వెంకట సుబ్బయ్యా ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెంద్రాయుడు, కలవకూరి చిన్న వెంకట సుబ్బయ్య,గుర్రం పుల్లపనాయుడు,చెరుకూరి శేఖర్, నర్సయ్య ,ఇండ్ల రామిరెడ్డి,కోనయ్య యాదవ్,పెట్లు రామయ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీఅభివృద్ధికి తమ సూచనలు తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా, గ్రామ సభలు మరియు ప్రజా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.




