Badvel: నామినేషన్ల అక్రమాలపై మండిపడ్డ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధ!
Badvel: బద్వేల్ స్థానిక ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీపై వైఎస్సార్సీపీ మండిపాటు. అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపణ.
Badvel: నామినేషన్ల అక్రమాలపై మండిపడ్డ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధ!
బద్వేల్: బద్వేల్ నియోజకవర్గం లో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం నామినేషన్ల వ్యవహారంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిందని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి. ప్రజల ఓటు హక్కుకు విలువ ఇవ్వకుండా బలవంతంగా ప్రజలను పరిపాలించే చెత్త ఆలోచన కలగడం దుర్మార్గం అన్నారు.
బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఎన్నికల సహాయ అధికారి గా ఉంటు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుమానాలు ఉన్నాయని నామినేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలలో రికార్డు అయిన విషయం మరచిపోయి కూటమి పార్టీకి అనుకూలంగా నామినేషన్ల ప్రక్రియను జరిపించారని ఆరోపించారు.
ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల సంతకాలు ఎలక్షన్ అధికారులు కూటమి నాయకులు కుమ్మక్కై వారి సంతకాలు ఫోర్జరీ చేసి పోటీలో లేమని కారణంతో మా కార్యకర్తల, అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించటం దారుణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాచపూడి సాయి మాట్లాడుతూ తను గతంలో కౌన్సిలర్ గా వైస్ చైర్మన్ గా పని చేసినప్పటికీ తను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో తన సంతకం సరిలేదని చెప్పి తిరస్కరించటం తనకు అవమానకరంగా ఉందని ఒక ఆర్యవైశ్యుని అభివృద్ధిని ఇలా అణిచివేయటం సిగ్గుచేటని అన్నారు.




