Badvel: గణేష్ ఉత్సవాలపై పోలీసుల సమీక్ష ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి!
Badvel: కడప జిల్లా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవాలపై సీఐ బి.రామకృష్ణ నేతృత్వంలో అవగాహన సదస్సు.
Badvel: గణేష్ ఉత్సవాలపై పోలీసుల సమీక్ష ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి!
Badvel: పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమావేశం.కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ బి.రామకృష్ణ .పాల్గొన్న ఎస్సైలు జయరాములు, రంగారావు,ఫైర్ ఆఫీసర్ చంద్రుడు, విద్యుత్ ఏ.ఈ.శివకుమార్.మండపాల ఏర్పాటు, విద్యుత్ భద్రతపై నిర్వాహకులు అవగాహన కలిగి ఉండాలని అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి ఉండాలని తెలియజేశారు.ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు మరియు అశ్లీలతకు చోటు లేదని ఆయన అన్నారు. ఇంకా ఎవరైనా గణేష్ ఉత్సవానికి మండపాలన ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఆన్ లైన్ లోని "గణేష్ ఉత్సవ్ "పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని తెలిపారు.
గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ఆయా పెద్దమనుషులు ఎప్పటికప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలపై దృష్టి ఉంచాలని వినాయక చవితి పర్వదినాలన్నీ పవిత్రంగా జరుపుకోవాలని ఎటువంటి కక్షలు, గొడవలకు పాల్పడదని అటువంటివి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహ మండపాలను ఏర్పాటు చేసే ప్రాంతాలకు సంబంధించిన పెద్ద మనుషులు, నిర్వాహకులు పాల్గొన్నారు.




