Badvel: బద్వేలులో విచ్చలవిడిగా సాగుతున్న గ్రావెల్ మాఫియా

Badvel: కడప జిల్లా బద్వేలులో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా. అబుసాయిపేటలో అక్రమ తవ్వకాలు. ఎలాంటి పర్మిషన్లు లేవని స్పష్టం చేసిన ఎమ్మార్వో తిరుమల బాబు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 15 Aug 2026 5:56 PM IST
Badvel
X

Badvel: బద్వేలులో విచ్చలవిడిగా సాగుతున్న గ్రావెల్ మాఫియా

బద్వేలు: కడప జిల్లా బద్వేలు పట్టణం గతంలో సాయిబాబా గుడి దగ్గర నుండి గ్రావెల్ తోలుతున్న విషయం మీడియా దృష్టికి రావడంతో మాఫియా దారులు మాఫియా దారులు అధికారుల కళ్ళు కప్పి రూట్ మార్చారు,

ఇప్పుడు అబుసాయిపేట సమీపంలో సర్వే నెంబర్ 1 లో రాత్రి వేళలో విచ్చలవిడిగా గ్రావెల్ మాఫియా దారులు రెచ్చిపోతున్నారు, అధికార నాయకుల పేర్లు చెప్పుకుంటూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చారు అంటూ, రెచ్చిపోతున్న మట్టి మాఫియా.

ఈ విషయంపై బద్వేల్ ఎమ్మార్వో తిరుమల బాబును వివరణ కోరగా, మట్టి గాని, గ్రావెల్ గాని తోలుకునేందుకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని అధికారుల పేరు చెప్పుకొని ఇలాంటి వాటికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేల్ ఎమ్మార్వో తెలియజేశారు.

అంతేకాకుండా బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతాలలో కొన్నిచోట్ల వ్యవసాయ భూములలో వెంచర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారని పర్మిషన్లు లేకుండా ఎలాంటి వెంచర్లు గాని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని కేసులు బుక్ చేస్తామని తెలియజేశారు., ఈ మాఫీదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story