Badvel: మెడికల్ షాప్స్ క్లోజ్ తహశీల్దార్ ఆఫీస్ వరకు కెమిస్టుల ర్యాలీ!

Badvel: ఆన్‌లైన్ మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా కడప జిల్లా బద్వేలులో మెడికల్ షాపులు పూర్తిగా బంద్ అయ్యాయి.

B. ARUN KUMAR, BADVEL
Published on: 20 May 2026 2:05 PM IST
Badvel
X

Badvel: మెడికల్ షాప్స్ క్లోజ్ తహశీల్దార్ ఆఫీస్ వరకు కెమిస్టుల ర్యాలీ!

బద్వేలు: అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపులో భాగంగా బద్వేలు పట్టణంలో గురువారం నిర్వహించిన కెమిస్టుల సమ్మె పూర్తిగా విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని మెడికల్ షాపులన్నింటినీ మూసివేసి నిరసన వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా బద్వేలు మెడికల్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల రాధాకృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు కె.వి. సుబ్బారావు, వేలూరి మురళీధర్ రెడ్డి, సెక్రటరీ దర్శి సుబ్బరాజా, ట్రెజరర్ మాలేపాటి సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మరియు పలువురు మెడికల్ షాపుల యజమానుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

​పోటీ శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు:

ముందుగా సిద్ధవటం రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ప్రధాన రహదారుల గుండా నినాదాలు చేస్తూ బద్వేలు తాహసిల్దార్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయ అధికారులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

​ప్రధాన డిమాండ్లు ఇవే:

​ఆన్‌లైన్ ద్వారా మందుల అమ్మకాలను (ఇ-ఫార్మసీ) తక్షణమే నిలిపివేయాలి. ​నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్న అధిక డిస్కౌంట్లను అరికట్టాలి. ​ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ, నాసిరకం మందులు తయారు చేసే కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ​ఈ కార్యక్రమంలో పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story