Kadapa: బద్వేల్ నడిబొడ్డున కిలాడీ దొంగల హైటెక్ చోరీ యత్నం!
Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్. ప్రముఖ 'ఎం.సీ ఫర్నిచర్ షోరూమ్' లో చోరీకి విఫలయత్నం.
Kadapa: బద్వేల్ నడిబొడ్డున కిలాడీ దొంగల హైటెక్ చోరీ యత్నం!
Kadapa: కడపజిల్లా బద్వేల్ పట్టణం మెయిన్ రోడ్డులో అర్ధరాత్రి దొంగల హల్‌చల్. పట్టణంలో ఓ పెద్ద ఫర్నిచర్ షోరూమ్ గా పేరుగాంచిన ఎం.సీ ఫర్నిచర్ షోరూంలో చోరీ యత్నం. ముందుగా సీసీ కెమెరాల కేబుల్స్ కట్ చేసిన దుండగులు. ఆనవాళ్లు దొరకకుండా పక్కా ప్లాన్.చోరీ ప్రయత్నం సీసీ కెమెరాలలో రికార్డు అయి ఉంటుందని ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలకు సంబంధించిన డివిఆర్ ను ఎత్తుకెళ్లిన దుండగులు.
గడ్డపారతో షట్టర్ లాకులు, సైడ్ డోర్ లాకులు తొలగించి షోరూంలోకి ప్రవేశం.క్యాష్ టేబుల్ డ్రాయర్లు, బీరువా తాళాలు పగలగొట్టి నగదు కోసం గాలించిన వైనం. నిన్నటికి నిన్న బద్వేల్ పట్టణంలో పట్టపగలు ఓ ఇంటిలో చోరీ మరువక ముందే మరో చోరీ ఘటన తో బద్వేల్ ప్రాంత ప్రజలు మరియు వ్యాపారుల్లో భయం. ఘటనా స్థలానికి చేరుకున్న బద్వేల్ పోలీసులు.ఒకే గ్యాంగ్ పనేనా అనే కోణంలో పోలీసుల ఆరా. వరుస దొంగతనాలను అరికట్టేందుకు బద్వేల్ పోలీస్ వారు ఎటువంటి చర్యలు తీర్చుకుంటారు వేచి చూడాలి. ఒక చోరీ జరిగి 24 గంటలు కాకముందే పట్టణం నడిబొడ్డున ఉన్న షోరూంలో చోరీకి విఫల యత్నం.




