Badvel: డిజిటల్ డోర్ నంబరింగ్ వేగవంతం కమిషనర్ ఎం.కృష్ణ!
Badvel: బద్వేల్ పురపాలక సంఘంలో డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియపై కమిషనర్ ఎం.కృష్ణ సమీక్ష. ప్రతి ఇంటికీ జియో-ట్యాగింగ్ పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశం.
Badvel: డిజిటల్ డోర్ నంబరింగ్ వేగవంతం కమిషనర్ ఎం.కృష్ణ!
Badvel: బద్వేల్ పురపాలక కార్యాలయంలో పురపాలక కమీషనర్ యం.కృష్ణ గారి ఆధ్వర్యంలో డిజిటల్ డోర్ నంబరింగ్ కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, పురపాలక సంఘం పరిధిలోని ప్రతి ఇంటికి, వాణిజ్య సముదాయానికి డిజిటల్ డోర్ నంబరింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిజిటల్ డోర్ నంబరింగ్ ద్వారా పౌర సేవల అందజేత, ఆస్తుల గుర్తింపు, పన్నుల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు మరియు పట్టణ ప్రణాళిక మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
వార్డ్ అడ్మిన్లు, అమెనిటీస్ కార్యదర్శులు, ప్లానింగ్ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జియో-ట్యాగింగ్‌తో డిజిటల్ డోర్ నంబరింగ్ పూర్తి చేయాలని సూచించారు. ప్రతిరోజూ పనుల పురోగతిని సమీక్షించి, పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఈఈ. సుమన్ రెడ్డి గారు, ఆర్.ఓ.గంగిరెడ్డి గారు, వార్డ్ అడ్మిన్లు, అమెనిటీస్ కార్యదర్శులు, ప్లానింగ్ కార్యదర్శులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
కమీషనర్, బద్వేల్ పురపాలక సంఘం




