Badvel: బద్వేల్ మున్సిపాలిటీలో ఇకపై ఆన్‌లైన్‌లోనే పన్నుల చెల్లింపులు!

Badvel: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇకపై ఆస్తి, నీటి పన్నులు మరియు ఇతర రుసుములను నగదు రహిత డిజిటల్ విధానంలో మాత్రమే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ ఆదేశించారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 12 Nov 2026 12:58 PM IST
Badvel
X

Badvel: బద్వేల్ మున్సిపాలిటీలో ఇకపై ఆన్‌లైన్‌లోనే పన్నుల చెల్లింపులు!

Badvel: పురపాలక సంఘ పరిధిలో ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులతో పాటు ఇతర మున్సిపల్ రుసుములను ఇకపై ఆన్‌లైన్ డిజిటల్ విధానంలో మాత్రమే స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణ తెలిపారు.

మున్సిపల్ కార్యాలయ కౌంటర్లతో పాటు అన్ని స్వర్ణ వార్డుల్లోనూ నగదు రహిత చెల్లింపుల విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులపై అవగాహన కల్పించి, అవసరమైన సహకారం అందించాలని పరిపాలన కార్యదర్శులకు సూచించారు.

పన్నుల వసూళ్లలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు ప్రజలకు సులభతరమైన సేవలు అందించడమే ఈ విధానం లక్ష్యమని కమిషనర్ పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ డిజిటల్ విధానంలోనే మున్సిపల్ పన్నులు చెల్లించి నగదు రహిత బద్వేల్ నిర్మాణానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL