Badvel: బద్వేల్ నామస్తే డే - పారిశుద్ధ్య కార్మికుల భద్రత

Badvel: బద్వేల్ మున్సిపాలిటీలో 'నామస్తే డే' నిర్వహణ. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, యాంత్రీకరణపై అవగాహన. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యం. కృష్ణ మరియు సిబ్బంది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 14 July 2026 8:08 PM IST
Badvel
X

Badvel: బద్వేల్ నామస్తే డే - పారిశుద్ధ్య కార్మికుల భద్రత

బద్వేల్: కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘంNAMASTE DAY – National Action for Mechanised Sanitation కోసిస్టమ్ "పారిశుద్ధ్య కార్మికుల భద్రత – మనందరి బాధ్యత" పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు NAMASTE DAY సందర్భంగా బద్వేల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

కార్యక్రమంలో ముఖ్యాంశాలు:

యాంత్రీకృత పారిశుద్ధ్య (Mechanised Sanitation) వ్యవస్థల వినియోగాన్ని ప్రోత్సహించడం. ప్రమాదకరమైన మానవ పారిశుద్ధ్య విధానాల నిర్మూలనపై అవగాహన కల్పించడం.వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE Kits) వినియోగం, భద్రతా ప్రమాణాలు మరియు అత్యవసర జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వడం.

పారిశుద్ధ్య కార్మికుల వృత్తి భద్రత, ఆరోగ్య పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం.సురక్షిత పారిశుద్ధ్య వ్యవస్థలే ఆరోగ్యవంతమైన, పరిశుభ్రమైన సమాజానికి బలమైన పునాది."ఈ కార్యక్రమంలో బద్వేల్ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ శ్రీ యం. కృష్ణ గారు, ఇన్‌చార్జ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ జి. రమణయ్య గారు, నవజీవన్ సంస్థ (Navajeevan Organization) ప్రతినిధులు సంఘమిత్ర పెంచలయ్య, ప్రసాద్ & షేక్ జహరా , మేస్త్రీలు, పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

పరిశుభ్రమైన, సురక్షితమైన మరియు ఆరోగ్యవంతమైన బద్వేల్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. బద్వేల్ పురపాలక సంఘం.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story