Badvel: లక్ష్మీపాలెంలో విజయవంతంగా ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం
Badvel: బద్వేల్ మండలం లక్ష్మీపాలెంలో మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 'పేదల సేవలో 2.0' కార్యక్రమం నిర్వహించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Badvel: లక్ష్మీపాలెంలో విజయవంతంగా ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం
బద్వేల్: బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, బద్వేల్ డివిజన్ ఆర్డీఓ గారి సూచనల మేరకు గురువారం బద్వేల్ మండలం లక్ష్మీపాలెం గ్రామపంచాయతీలో “పేదల సేవలో 2.0” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించారు. శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పేదల సేవలో 2.0 కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు, వినతులు మరియు అవసరాలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల వారీగా నమోదు చేసి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, “ప్రజల వద్దకే అధికారులు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే పేదల సేవలో 2.0 కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సమన్వయంతో పనిచేస్తాం” అని తెలిపారు.
వ్యవసాయం, ఉద్యానవనం, రెవెన్యూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, ఉపాధి హామీ, డ్వాక్రా, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, వ్యవసాయం, వైద్యం, మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై ప్రజలు అందించిన వినతులను అధికారులు పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
“ప్రజల వద్దకే పాలన – ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం” అనే ఉద్దేశంతో పేదల సేవలో 2.0 కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో DLDO, బద్వేల్ డివిజన్, మున్సిపల్ కమిషనర్, బద్వేల్, MPDO, MRO, SGWS అధికారి, మండల వ్యవసాయ మరియు ఉద్యానవన అధికారులు, మెడికల్ ఆఫీసర్, CDPO/అంగన్‌వాడీ సూపర్‌వైజర్, APO, APM, AE-RWS, AE-పంచాయతీరాజ్, AE-ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




