Badvel: బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో ముగిసిన హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్

Badvel: కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల కోసం నిర్వహించిన మూడు రోజుల 'హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్' శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 2 Jun 2026 7:32 PM IST
Badvel
X

Badvel: బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో ముగిసిన హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్

Badvel: ఉదయం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో బద్వేల్ పట్టణ మరియు రూరల్ సర్కిల్ స్టాఫ్ కలిసి హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ మూడవ రోజు అనగా చివరి రోజు కార్యక్రమంలో భాగంగా బద్వేల్ కి చెందిన మెడిటేషన్ గురు అయిన టీచర్ మస్తాన్ రెడ్డి గారి పర్యవేక్షణ లో మెడిటేషన్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్ ఐ లు మరియు టౌన్ సిఐ రామకృష్ణ రూరల్ సీఐ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పోలీసు ఉన్నతాధికారుల మేరకు జిల్లాలోని అన్ని అర్బన్ రూరల్ పోలీస్ స్టేషన్లో గత మూడు రోజుల నుంచి జరుగుచున్నది. చివరి రోజైన మూడవ రోజు కూడా హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం వలన పోలీసులలో పని ఒత్తిడిని అధికమించడంలోనూ రోజువారి కార్యక్రమాలలో ఎటువంటి అవాంతరాలు లేకుండా సజావుగా సాగించుటకు దోహదపడుతుందని ఉన్నతాధికారుల అభిప్రాయం.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story