Badvel: బద్వేల్ 13, 14 వార్డుల్లో ఆర్‌డీవో, కమిషనర్ పర్యటన
Badvel: బద్వేల్‌లో ప్రజల వద్దకే అధికారులు. 13, 14 వార్డుల్లో డ్రైనేజీ, రోడ్లు, కరెంట్ సమస్యలను పరిశీలించిన ఆర్‌డీవో చంద్రమోహన్, కమిషనర్ కృష్ణ.
బద్వేల్: ఈరోజు అనగా 30.07.2026వ తేదీన ఉదయం 8.00 గంటలకు బద్వేల్ రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు బద్వేల్ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్, శ ఏ.చంద్రమోహన్ , మున్సిపల్ కమిషనర్,బద్వేల్ ఎం.కృష్ణ కలిసి మహబూబ్ నగర్ సచివాలయ పరిధిలో
ఉన్నటువంటి 13వ మరియు 14వ వార్డుల్లో ప్రజల సమస్యలు అడిగి వారు అడిగిన డ్రైనేజీ పనులు, రోడ్డు సమస్యలు, అమ్మవడి సమస్యలు, విద్యుత్ లైన్ సమస్యలు మరియు చెత్త సేకరణ అన్నిటినీ మున్సిపాలిటీ మరియు సచివాలయం పరిధిలోని అధికారులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని తగు సూచనలు చేయడం జరిగింది.
కనీసం అధికారులు తమ కాలనీలను స్వయంగా సందర్శించడం వలన ఆయా కాలనీలలో ఉన్నటువంటి మౌలిక వసతులను త్వరితగతిన పరిష్కరిస్తారని కాలనీవాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ RTC డిపో మేనేజర్ కన్యాకుమారి , సచివాలయ సిబ్బంది మరియు బద్వేల్ మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.




