Badvel: బద్వేల్ రూ. 3.32 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కేంద్రం
Badvel: బద్వేల్‌లో రూ.3.32 కోట్లతో 40 టన్నుల సామర్థ్యం గల మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ప్రారంభం. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా.
Badvel: బద్వేల్ రూ. 3.32 కోట్లతో వ్యర్థాల నిర్వహణ కేంద్రం
బద్వేల్: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో ఆధునిక సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం ప్రారంభమైంది. రూ.3.32 కోట్ల వ్యయంతో నిర్మించిన 40 టన్నుల సామర్థ్యం గల మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (MRF)ని బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు.
బద్వేల్ పట్టణాన్ని పరిశుభ్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజుకు 40 టన్నుల ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పునర్వినియోగం చేయడంతో పాటు కంపోస్ట్ తయారీ కూడా చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి.. ఇంటి వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీకి అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే పరిశుభ్రమైన బద్వేల్ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చంద్రమోహన్, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు




