Badvel: మానవ సేవే మాధవ సేవ: బద్వేలు వృద్ధాశ్రమంలో నారాయణ సేవ!

Badvel: సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో నారాయణ సేవ నిర్వహించారు. వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 30 July 2026 5:43 PM IST
Badvel
X

Badvel: మానవ సేవే మాధవ సేవ: బద్వేలు వృద్ధాశ్రమంలో నారాయణ సేవ!

సెంటర్ : బద్వేల్

రిపోర్టర్ : అరుణ్ కుమార్

బద్వేలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో నారాయణ సేవ

బద్వేలు, జూలై 29: శ్రీ సత్యసాయి బాబా బోధించిన "మానవ సేవే మాధవ సేవ" అనే దివ్య సందేశాన్ని ఆచరణలో నిలుపుతూ, బద్వేలు సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో నేడు ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో నారాయణ సేవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు ప్రేమపూర్వకంగా అన్నప్రసాదాన్ని అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సేవాదళ్ సభ్యులు వినయంతో సేవలందిస్తూ, వృద్ధులతో ఆప్యాయంగా మమేకమయ్యారు.

ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో అవసరమైన వారికి నిస్వార్థ సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, శ్రీ సత్యసాయి బాబా చూపిన సేవా మార్గంలో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో బద్వేలు సత్యసాయి సేవాసమితి సభ్యులు, సేవాదళ్ సభ్యులు మరియు భక్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story