Badvel: జీవో 396 రద్దు చేయాలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ధర్నా!

Badvel: జీవో నెం. 396 ఉపసంహరించుకోవాలని బద్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు, సర్వేయర్ల నిరవధిక ధర్నా. జూలై 31 వరకు సేవల బహిష్కరణ.

B. ARUN KUMAR, BADVEL
Published on: 21 July 2026 7:42 AM IST
Badvel
X

Badvel: జీవో 396 రద్దు చేయాలి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద ధర్నా!

Badvel: రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రచన, రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సేవలను ప్రైవేటుకరించే దిశగా చర్యలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, డిడి రైటర్లు, సర్వేయర్లు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నిరవధిక ధర్నాకు దిగారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎం.ఎస్ నెంబర్.

396 అమలుతో ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ఉపాధి పొందుతున్న డాక్యుమెంట్ రైటర్లు, డిడి రైటర్లు, సర్వేయర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని జీవోను ఉపసంహరించుకునే వరకు జూలై 20వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రచన, రిజిస్ట్రేషన్ సంబంధించిన సేవలను బహిష్కరిస్తూ నిరవధిక ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.ఈ ఉద్యమానికి ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు,ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బాలిశెట్టి వెంకటేశ్వర్లు,నరసింహారావు, చంద్రశేఖర రావు, వేణుగోపాల్, కె. వెంకటేశ్వర్లు, నాగేంద్ర,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story