Badvel: మంత్రి సవిత ముందే తెలుగు తమ్ముళ్ల కొట్లాట.. కారుపై దాడి

Badvel: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీలో వర్గ పోరు రోడ్డున పడింది.

B. ARUN KUMAR, BADVEL
Published on: 4 July 2026 8:44 AM IST
Badvel
X

Badvel: మంత్రి సవిత ముందే తెలుగు తమ్ముళ్ల కొట్లాట.. కారుపై దాడి

Badvel: జిల్లా ఇన్చార్జి మినిస్టర్ సవిత, జోనల్ ఇంచార్జ్ శ్రీనివాసులు రెడ్డి, పార్టీ పరిశీలకులు దుగ్గల నాగేంద్ర, జిల్లా టిడిపి ఇన్చార్జి భూపేష్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ కార్యక్రమం అరుపులు, కేకలతో హోరెత్తిపోయింది. నిన్న నారా చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు పర్యటన అనంతరం బద్వేల్ టిడిపి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశం అనంతరం జిల్లా మంత్రి సవిత అధ్యక్షతన బద్వేల్ నియోజకవర్గ టిడిపి నాయకులతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సమావేశానికి ఇరు వర్గాలకు చెందిన టిడిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒకానొక దశలో ఎవరికివారు అన్నట్లుగా వ్యవహరించారు. మంత్రి సమక్షంలోనే కార్యకర్తలు అరుపులు కేకలు వేయడంతో మంత్రి సవిత కార్యకర్తలకు తాను కూడా రాయలసీమ బిడ్డని అని ఇలా క్రమశిక్షణ లేకుండా చేయటం పార్టీని దిగదర్చే విషయంగా భావించబడుతుందని,

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని అభిప్రాయ సేకరణను సవ్యంగా కొనసాగించేలా సహకరించాలని హితువు పలికారు. బద్వేల్ నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ విషయంలో రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో భాగంగా పార్టీ నాయకులను పంపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని కాదని ఎవరికి వారు నియోజకవర్గ ఇన్చార్జ్ కావాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు కార్యకర్తలు అదే ప్రాంగణం సమీపంలో ఉన్న సూర్యనారాయణ రెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుని వాహనంపై దాడికి యత్నం చేశారు. తెలుగు తమ్ముళ్లు ఇలా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడటంతో దిక్కు తోచని స్థితిలో కార్యకర్తలు ఉన్నారు..

ఈ విషయంపై పార్టీ అధిష్టానం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని వెల్లడించకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దాడికి యత్నించిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story