Badvel: బద్వేల్‌లో గాంధీ విగ్రహానికి సూర్యనారాయణ రెడ్డి నివాళి

Badvel: బద్వేల్ పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ ఇన్చార్జ్, కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 2 Oct 2026 3:28 PM IST
Badvel
X

Badvel: బద్వేల్‌లో గాంధీ విగ్రహానికి సూర్యనారాయణ రెడ్డి నివాళి

కడప జిల్లా, బద్వేల్: బద్వేల్ పట్టణంలోని పోరుమామిళ్ల రోడ్డు నందు గల అమ్మవారి శాల వీధి ప్రధాన రహదారి లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి సందర్భంగా పూలమాలవేసిన నివాళులు అర్పించిన బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు కడప డి సి సి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి.

ఆయనతోపాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ మహోన్నతమైన వ్యక్తి అని కోనియాడారు.

200 సంవత్సరాల బ్రిటిష్ పాలనను అహింస అనేటువంటి నినాదంతో ఎన్నో పోరాటాలు చేసి భారత దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి అని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తికి మన భారత జాతి అంతా గౌరవ మర్యాదలు ఇవ్వాలని, అంతేకాకుండా మన బానిస సంఖ్యలను తెంచివేసి మనకు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చి పోరాటం లో మనకు ఆదర్శంగా నిలచినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ.

ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా మన దేశాన్ని మనం పరిపాలించుకునే దానికి కారకుడు అయినటువంటి ఉన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీని చరిత్ర ఉన్నంతవరకు గుర్తుంచుకోవాలని అంతటి గొప్ప వ్యక్తి సాదాసీదా వ్యక్తిగా ఉంటూ భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలచినటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీని కొనియాడారు.

యువత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని బాధ్యతాయుతంగా దేశం కోసం సమాజం పట్ల గౌరవంతో పోరాడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL