Badvel: బద్వేల్‌లో ప్రపంచ జనాభా దినోత్సవ వారాంతపు అవగాహన ర్యాలీ

Badvel: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సురేంద్ర నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ వారాంతపు అవగాహన ర్యాలీ.

B. ARUN KUMAR, BADVEL
Published on: 16 July 2026 9:28 AM IST
Badvel
X

Badvel: బద్వేల్‌లో ప్రపంచ జనాభా దినోత్సవ వారాంతపు అవగాహన ర్యాలీ

Badvel: ప్రపంచ జనాభా దినోత్సవం వారాంతపు అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారము బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సురేంద్ర నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధి లోని సురేంద్ర నగర్ నందు , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం వారంతపు జనాభా దినోత్సవం ర్యాలీ మరియు సమావేశము సెల్ఫీ గ్రూపు వారితో మరియు గర్భిణీ స్త్రీలు బాలింతలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జనాభా పెరగడము వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించడం,పిల్లల మధ్య ఎడమ పాడిద్దాం- ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం",సరైన సమయంలో గర్భం ధరించడం బిడ్డకు బిడ్డకు మధ్య రెండు నుండి మూడు సంవత్సరాలు సమయo ఉండడం మంచిదని చెప్పడం జరిగినది. ఈ సందర్బంగా భవిష్యత్ తరాల కోసం మనమందరం పాటుపడాలని చెప్పడం జరిదినది.

అలాగే బిడ్డ బిడ్డ కు ఏడం కొరకు తాత్కాలిక పద్ధతులు అయిన కండోమ్, ఛాయా, మాలా -ఎన్, అoతరం, ఈ సి పిల్, పి పి ఐ యు సీ డి /కాపర్ టీ ఉపయోగించమని చెప్పడం జరిగినది.జనాభా నియంత్రణ అనేది ప్రతి కుటుంబం ఆరోగ్యనికి, ముఖ్యం గా మహిళల శ్రేయస్ కు చాలా అవసరమును పేర్కొన్నారు, చిన్న కుటుంబం వలన కలిగే ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలపై ఇంకా విస్తరితంగా అవగాహన పెరగాలన్న తల్లి పిల్లలు ఆరోగ్యం బాగుండాలని పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కుటుంబా నియంత్రణ పద్దతు పై అవగాహన ముఖ్యమని.

దేశానికి భారం కాకూడదు అంటే కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కుటుంబంపై స్త్రీల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికి సరి అయిన అవగాహన కల్పించాలని అప్పుడే దేశ సంపద జనాభా సమంగా ఉంది సమాజం అభివృద్ధి పథంలో నడు స్తుంది పేర్కొనడమైనది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి. వెంగయ్య మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టాలి లింగ వివక్షత అనేది లేకుండా ఆడైనా మగైనా ఇద్దరు సమానులని పిసిపి ఎన్ డి టీ 1994 చట్టం పైన మరియు వ్యాధి నిరోధక టీకాల,

సంక్రమణ అ సంక్రమణవ్యాధుల పైన గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష కాహారం ప్రాముఖ్యతను గురించి 108,102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ గురించి ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన ప్రోగ్రాం గురించి ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ ప్రోగ్రామ్ గురించి, 14 నుంచి 15 సంవత్సరాలలో బాలికలకు హెచ్ పి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను గురించి, గర్భాశయముఖద్వారా క్యాన్సర్ గర్భాశ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నోటి క్యాన్సర్ పై అవగాహన కల్పించడమైనది. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వి.జనార్దన్ రావు ఏ ఎన్ యం లు, బి. సుధాధీరావతి ఆర్. లక్ష్మీదేవి జి.గురమ్మ అంగనవాడి టీచర్స్ ఆశలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story