Kamareddy: కాంగ్రెస్‌ను గద్దె దించాలి: బాన్సువాడలో బాజిరెడ్డి ధర్నా!
Kamareddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా. అసెంబ్లీ వద్ద పోలీసుల తీరును ఖండించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
Kamareddy: కాంగ్రెస్‌ను గద్దె దించాలి: బాన్సువాడలో బాజిరెడ్డి ధర్నా!
Kamareddy: బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా లో బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.నిన్న అసెంబ్లీ వద్ద తమ నాయకుల పై జరిగిన దురుసు ప్రవర్తన,పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా,ఈ రోజు బీ ఆర్ ఎస్ నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
దీనికి ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ,నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన, తమ నాయకులు కీ టీ ఆర్,హరీష్ రావు ల పై దురుసుగా ప్రవర్తించిన పోలీసుల తీరును ఖండించారు.
మహిళా శాసన సభ్యులని చూడకుండా వారి నీ కూడా లాగారని,ఇది అమానవీయ చర్య అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా,గుండాయిజం చేస్తోందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మెన్ జూబేర్,మోరిల్ శ్రీనివాస్, ఎర్రవట్టి సాయిబాబా, దుద్దాల అంజిరెడ్డి, మోచి గణేష్,ఖలీల్, బోడా చందర్,ప్రసాద్,రమేష్ యాదవ్,రాము,మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




