Proddutur: గుంతలు లేని రాష్ట్రమే లక్ష్యం ప్రొద్దుటూరులో భారీ రోడ్డు!

Proddutur: అభివృద్ధి పనులకు శ్రీకారం. రూ. 5.4 కోట్లతో కొర్రపాడు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శంకుస్థాపన చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 9 May 2026 2:05 PM IST
Proddutur
X

Proddutur: గుంతలు లేని రాష్ట్రమే లక్ష్యం ప్రొద్దుటూరులో భారీ రోడ్డు!

ప్రొద్దుటూరు: జగన్ పాలన విధ్వంసంతో మొదలైతే... కూటమి ప్రభుత్వం పాలన అభివృద్ధితో మొదలయ్యింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డితో క‌లిసి రూ.5. 4 కోట్ల ప‌నుల‌కు శిలాఫ‌ల‌కం ఆవిష్క‌రించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి..అయన మాట్లాడుతూ గత ప్రభుత్వం లో జ‌గ‌న్ ప‌రిపాల‌న విధ్యంసంతో మొద‌లైంది. కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న అభివృద్ధితో మెద‌లైంది. వైసీపీ పాల‌న‌లో రాష్ట్రంలోని రోడ్ల‌న్నీ గుంత‌ల‌మయం అయ్యాయి.

కూట‌మి వ‌చ్చిన 9 నెల‌ల్లోనే 1080 కోట్ల‌తో గుంత‌లేని రాష్ట్రంగా మార్చాం, వైసీపీ ప్రభుత్వం లో ఆర్ అండ్ బీ శాఖ‌ను జ‌గ‌న్ నిర్వీర్యం చేసి ప‌రిశ్ర‌మ‌లు పారిపోయేలా చేశాడు. తాము అధికారంలోకి వ‌స్తే జైళ్ల‌లో వేస్తాం అంటూ ఇప్పటికీ ప‌రిశ్ర‌మ‌లు రాకుండా జ‌గ‌న్‌ బెదిరిస్తున్నారు. జైళ్ల‌లో ఉండే జ‌గ‌న్ జైళ్ల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియర్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, నంద్యాల కొండారెడ్డి, సీఎం సురేష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story