Annamayya: అన్నమయ్య పోలీస్ శాఖలో 'తార' జాగిలం ప్రవేశం

Annamayya: అన్నమయ్య జిల్లా పోలీసు శాఖలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన 'తార' జాగిలం చేరింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఎదుట హ్యాండ్లర్లు దీనిని ప్రవేశపెట్టారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 12 Oct 2026 6:52 PM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య పోలీస్ శాఖలో 'తార' జాగిలం ప్రవేశం

Annamayya: అన్నమయ్య జిల్లాలో అసాంఘిక శక్తుల ఆటకట్టించి, నేరస్తులను పసిగట్టేందుకు పోలీసు శాఖలో బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన 'తార' అనే జాగిలం చేరింది.

మంగళగిరిలో 11 నెలల పాటు కఠిన శిక్షణ పొందిన ఈ జాగిలానికి, పేలుడు పదార్థాలను ముందుగానే పసిగట్టడంలో మరియు గాలి వాసనతో నేరస్తులను ట్రాక్ చేయడంలో అత్యంత నైపుణ్యం ఉంది.

ఆర్ఐ యు. రంగనాథ్ బాబు, ఏఆర్ఎస్ఐ ఎస్. వేణుగోపాల్ ఆధ్వర్యంలో హ్యాండ్లర్లు సి. సుబ్బరామరాజు, బి. ప్రసాద్ నాయక్ సోమవారం ఈ జాగిలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,. గారి ఎదుట ప్రవేశపెట్టారు.

'తార'కు సరైన పౌష్టికాహారం అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఎస్పీ గారు హ్యాండ్లర్లకు సూచిస్తూ, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లలో దీని సేవలను ముమ్మరంగా వినియోగిస్తామని స్పష్టం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI