Kadapa: కడపలో బినామీ సబ్సిడీ బాగోతం: అడ్డంగా దొరికిపోయిన నేతలు!
Kadapa: కడప జిల్లా దువ్వూరులో ఎస్సీ మహిళ పేరుతో రూ. 47 లక్షల రాయితీని అక్రమంగా కాజేసేందుకు చేసిన ప్రయత్నం బయటపడింది.
Kadapa: కడపలో బినామీ సబ్సిడీ బాగోతం: అడ్డంగా దొరికిపోయిన నేతలు!
కడప: 'నా ఎస్సీలు.. నా ఎస్టీలు' అంటూ గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు పైకి ప్రకట నలు గుప్పించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ నేతలు కొందరు వారిని నిలువునా మోసం.. దగా.. వంచనకు గురిచేశారు. బినామీల పేర్లతో రాయితీలు దిగమింగి ద్రోహం చేశారు. ఇటువంటి వ్యవహారం ఒకటి తాజాగా దువ్వూరు మండల కేంద్రంలో తాజాగా వెలుగు చూసింది. ఎస్సీ లబ్ది దారు పేరుతో ప్రభుత్వ రాయితీని తెర వెనుక వేరే వ్యక్తులు బొక్కిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. స్పందించిన అధికారులు దువ్వూరు గ్రామం లోని సీవీవీ కల్యాణ మండపం పేరిట మంజూరైన రూ. 46,98,924 పెట్టు బడి రాయితీ విడుదలను తక్షణమేనిలిపివేయాలంటూ జిల్లా పరిశ్రమల కేంద్రం(డీఐసీ) జనరల్ మేనేజర్.. పరిశ్రమల శాఖ కమిషనరేటు అత్య లేఖ రాశారు.
పారిశ్రామిక విధానం ఆసరాగా బొక్కుడు: పారిశ్రా
మిక అభివృద్ధి విధానం కింద సదరు కల్యాణ మండపా నికి రూ. 46.98 లక్షల రాయితీ మంజూరు చేస్తూ 2025 మే 9న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ పేరిట ఈ రాయితీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిధుల విడు దలకు అధికారులు జాబితా సిద్ధం చేస్తున్నారు. ఈ తరు ణంలో "పేరు ఒకరిది.. లబ్ధి మరొకరిది'గా ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టగా.. క్షేత్రస్థాయిలో కల్యాణ మండపాన్ని ఎస్సీయేతర సామాజిక వర్గానికి చెందిన వైకాపా నేత వీర వెంకటస్వామి నిర్వహిస్తున్నట్లు తేలింది.
వాటాకు మరో నేత పట్టు :
త్వరలోనే సదరు వైకాపా నేత ఖాతాలో రాయితీ నిధులు దాదాపు రూ. అర కోటి వరకు జమ కానున్నాయి. ఈ తరు ణంలో బినామీ వ్యవహారం తెర పైకి వచ్చింది. రాయితీలో తనకూ 50 శాతం వాటా ఇవ్వా లని వైకాపాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఒకరు డిమాండ్ చేయడం.. అందుకు కల్యాణ మండపం నిర్వహిస్తున్న నేత ససేమిరా అనడంతో విషయం బహిర్గతమైంది. ప్రభుత్వ నిధుల దోపిడీపై ఉన్నతాధికారు లకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేయడంతో వ్యవ హారం అడ్డం తిరిగింది. లబ్దిదా రుల అర్హతల పై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే వరకు రాయితీ సొమ్మును నిలిపివేయాలని పరి శ్రమల శాఖ కమిషనరు డీఐసీ జీఎం అత్యవసర లేఖ రాశారు.




