Annamayya: మదనపల్లెలో క్రోమా ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం!
Annamayya: మదనపల్లెలో క్రోమా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. కదిరి రోడ్డులోని సంగం హాల్లో జరిగిన ఈ శిబిరంలో స్వచ్ఛందంగా తరలివచ్చి పలువురు రక్తదానం చేశారు.
Annamayya: మదనపల్లెలో క్రోమా ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం!
Annamayya: మదనపల్లె రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో మదనపల్లెలో క్రోమా ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. కదిరి రోడ్డులోని సంగం హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రోమా ప్రతినిధులు మాట్లాడుతూ.
రక్తదానం అనేది ఒక గొప్ప సామాజిక సేవ అని, మనం ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకొని, స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి!




