Chowdepalle: చౌడేపల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు.. రక్తదానం

Chowdepalle: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని చౌడేపల్లిలో శ్రీరామ భరత్ వరుణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

MAHESH, PUNGANOOR
Published on: 11 Sept 2026 4:03 PM IST
Chowdepalle
X

Chowdepalle: చౌడేపల్లిలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు.. రక్తదానం

చౌడేపల్లి: రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చౌడేపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చౌడేపల్లి మాజీ సర్పంచ్ వైఎస్సార్సీపీ యువ నాయకుడు శ్రీరామ భరత్ వరుణ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు వైయస్సార్సీపి నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు.

మా నాయకుడు మిథున్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనీ భరత్ వరుణ్ తెలిపారు. వైయస్సార్సీపి మహిళ రాష్ట్ర నాయకురాలు మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మాట్లాడుతూ ఎంపీ మిధున్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు వైయస్సార్సీపి యువ నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ బోయకొండ చైర్మన్ మిద్దిన్టి శంకరనారాయణ, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి సినిమా రాజారెడ్డి, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్, శ్రీరామ అరుణ్ కుమార్, పవన్ కుమార్ ,రామ్బాణం శ్రీనివాసులు, బోయకొండ లడ్డు రమణ, జంగారెడ్డి, వైసీపీ మహిళా నాయకురాలు ప్రియా, మాజీ వైస్ ఎంపీపీ రవిచంద్రారెడ్డి, మంజునాథ్, గోపి, మాజీ ఎంపీటీసీ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR