Kadapa: పోలీసులను ఆశ్రయించిన మాజీ పీఠాధిపతి భార్య!

Kadapa: పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి, మాజీ మేనేజర్ ప్రసాద్‌లు తమపై దాడులకు తెగబడుతున్నారని మాజీ పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మి ఆరోపించారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 3 Aug 2026 8:16 PM IST
Kadapa
X

Kadapa: పోలీసులను ఆశ్రయించిన మాజీ పీఠాధిపతి భార్య!

కడప: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి తమపై దాడులకు దిగుతున్నారని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన వారు పట్టించుకోవడంలేదని మాజీ పీఠాధిపతి భార్య మారుతి మహాలక్ష్మి ఆరోపించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాలక్ష్మి మాట్లాడుతూ కడప జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయినా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం లో తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామి, మాజీ మేనేజర్ ప్రసాద్‌లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు .

తాత్కాలిక మఠాధిపతి వెంకటాద్రి స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని బాధితురాలు మారుతీ లక్ష్మీదేవి ఆరోపించారు. మాజీ మేనేజర్ ప్రసాద్ ప్రోద్బలంతోనే మఠంలో మహిళలు, వారసులపై నిత్యం వేధింపులు, అరాచకాలు సాగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నుంచి వెంకటాద్రి స్వామి పేరును పోలీసులు కావాలనే తొలగించారని లక్ష్మీదేవి విమర్శించారు.

దివంగత మఠాధిపతి గోవింద స్వామినే తదుపరి వారస మఠాధిపతిగా నియమించారని , కానీ వెంకటాద్రి స్వామి, ప్రసాద్ అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా నన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారని , నా ఇంటి తాళాలు పగులగొట్టి సామాన్లు ఎత్తుకెళ్లారని మేముంటున్న చోట విషపూరిత మందులు చల్లడంతో పిల్లలతో కలిసి వరండాలోనే కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story