Rayachoti: బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు: బీఎస్పీ!
Rayachoti: బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి వీరబల్లిలో బీఎస్పీ డిమాండ్ 9వ షెడ్యూల్‌లో చేర్చాలని చంద్రబాబుకు విజ్ఞప్తి.
Rayachoti: బీసీలకు 50% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు: బీఎస్పీ!
రాయచోటి: మరోసారి బీసీలను మోసం చేసిన చంద్రబాబు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టించి, ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసుండాలి. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి... బహుజన్ సమాజ్ పార్టీ, డిమాండ్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలని, నిత్యం 'టీడీపీ అంటే బీసీల పార్టీ - బీసీలు అంటే టీడీపీ' అని చెబుతూ ఉంటారు కదా! మరి ఆ మేరకు బీసీల మీద ప్రేమే ఉంటే, ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వారి ప్రభుత్వమే ఉంది కదా మరి చంద్రబాబు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి, తాను 9.7.2012న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు, 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టించి అమలు చేసుండాలి అన్ని బహుజన్ సమాజ్ పార్టీ, డిమాండ్.
కార్యక్రమానికి, రాజంపేట అసెంబ్లీ ఇంచార్జ్ పెదవిటి నరసింహులు. BSP పార్టీ వీరబల్లి మండలం అధ్యక్షుడు మద్దెల వెంకటరమణ, మరియు BSP పార్టీ నాయకులు పాల్గొన్నారు.




