Kadapa: బస్సు పల్టీ.. ప్రాణభయంతో వణికిపోయిన కార్మికులు!
Kadapa: నెల్లూరు-కడప సరిహద్దులోని NH-565 పై తెల్లవారుజామున బస్సు ప్రమాదం. అదానీ గ్రూప్ కార్మికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.
Kadapa: బస్సు పల్టీ.. ప్రాణభయంతో వణికిపోయిన కార్మికులు!
Kadapa: NH-565 నెల్లూరు-కడప జిల్లా సరిహద్దు సమీపంలో బస్సు ప్రమాదం. తెల్లవారుజామున 4 గంటల సమయంలో బోల్తా కొట్టిన కార్మికుల బస్సు. పశ్చిమ బెంగాల్ నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్తున్న కార్మికులు. అదానీ గ్రూప్‌కు చెందిన 46 మంది కార్మికులతో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గట్టును ఢీకొట్టి పల్టీ కొట్టిన బస్సులో మొత్తం 48 మంది ప్రయాణం.ఇద్దరు డ్రైవర్లు సహా 46 మంది కార్మికులు. 4 నుంచి 5 మందికి స్వల్ప గాయాలు. క్షతగాత్రులను వెంటనే బద్వేల్ ఆసుపత్రికి తరలించిన స్థానికులు వెంటనే.ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపిన స్థానిక ఎస్సై శ్రీనివాస్ రావు. హైవే సిబ్బంది, స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రమాదం అనంతరం NH-565 పై ట్రాఫిక్ పునరుద్ధరణ చేశారు.




