Proddatur: పూలమాలలు, శాలువాతో సీనియర్ నేతను ఘనంగా సన్మానించిన వ్యాపారవేత్త!

Proddatur: ప్రొద్దుటూరులో ప్రముఖ వ్యాపారవేత్త గంజికుంట నరేష్ కుమార్, సీనియర్ టీడీపీ నేత బద్వేల్ శ్రీనివాసుల రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 27 Nov 2026 1:00 PM IST
Proddatur
X

Proddatur: పూలమాలలు, శాలువాతో సీనియర్ నేతను ఘనంగా సన్మానించిన వ్యాపారవేత్త!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రముఖ వ్యాపారవెర్త గంజికుంట నరేష్ కుమార్ స్థానిక రాజకీయ ప్రముఖులతో మర్యాదపూర్వకంగా కలిశారు.మీడియా రంగం నుండి అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం ఫైనాన్స్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గంజికుంట నరేష్ కుమార్. ప్రొద్దుటూరు ఆదిత్య రామ్ కాంప్లెక్స్‌లోని ప్రముఖ కాంట్రాక్టర్, సీనియర్ నేత బద్వేల్ శ్రీనివాసుల రెడ్డి కార్యాలయాన్ని వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

​అనంతరం కాసేపు వారితో ఆత్మీయంగా ముచ్చటించిన నరేష్ కుమార్, 30 వ వార్డు కౌన్సిలర్ ఉట్టి నరేంద్ర, ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు, సీనియర్ నాయకులను కలిసి సత్కరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో బాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వారి మిత్రులు పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR