duvvuru: ముర్రుపాలు పట్టించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది సిడిపిఓ

duvvuru: దువ్వూరు మండలంలో సిడిపిఓ ముంతాజ్ బేగం ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 7 Aug 2026 5:17 PM IST
duvvuru
X

duvvuru: ముర్రుపాలు పట్టించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది సిడిపిఓ

Duvvuru: దువ్వూరు మండలంలో తల్లిపాలవారోత్సవాలు మండల స్థాయిలో ప్రాజెక్టు సి.డి.పి.ఓ ముంతాజ్ బేగం ఆధ్వర్యంలో జరుపుకోవడమైనది ఈ సందర్భంగా సి.డి.పి.ఓ ముంతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటాము అని,తల్లిపాల విశిష్టతను తెలుపుతూ బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు పట్టించాలని, ముర్రుపాలు త్రాగించడం వల్ల బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వలన తల్లి బిడ్డ మధ్య ప్రేమానుబంధం పెరుగుతుందని,ముర్రుపాలు బిడ్డ కు మొదటి టీకా.

మొదటి ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే పట్టించాలి వేరే ఇతర ఆహారాలని ఇవ్వకూడదని, బిడ్డ కు ఏడవ నెల నుండి తల్లిపాలతో పాటు అనుబంధ పౌష్టికాహారం ఇవ్వాలని తెలిపారు, బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటవి రాకుండా ఉంటాయని.

గర్భాధారణ సమయం నుండి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన బిడ్డ ఆరోగ్యంతో ప్రసవించడం, మరియు ప్రసవానంతరం కూడా పండ్లు, కూరగాయలు ఆకుకూరలు, పాలు,ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ప్రతి తల్లి ప్రసవించిన తర్వాత ఎటువంటి సంకోచము లేకుండా ప్రశాంతంగా బిడ్డకు పాలు ఇచ్చేలా ప్రతి బిడ్డ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసుకోవాలని, అలాగే అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు, బాలింతలకు, ఆరు నుంచి మూడు సంవత్సరముల పిల్లలకు, అంగన్వాడీ కేంద్రంకు వస్తున్నటువంటి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో అందిస్తున్నటువంటి పౌష్టిక ఆహారము గురించి ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ గురించి అవగాహన కల్పించారు .

ఈ కార్యక్రమంలో దువ్వూరు పి.హెచ్.సి నుండి రాజగోపాల్, సూపర్వైజర్స్ సౌజన్య ,కళావతి ,గర్భవతులు, బాలింతలు, మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు, దువ్వూరు టు సచివాలయం ఏ.ఎన్.ఎం పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story