Duvvuru: మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కలిసిన పాఠశాల కమిటీ సభ్యులు!

Duvvuru: దువ్వూరు మండలం చల్లబసాయిపల్లె పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎన్నికైన వారు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 1 Oct 2026 8:28 AM IST
Duvvuru
X

Duvvuru: మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని కలిసిన పాఠశాల కమిటీ సభ్యులు!

Duvvuru: ​దువ్వూరు మండల పరిధిలోని చల్లబసాయిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన జేష్ఠది ఝాన్సీ, వైస్ చైర్మన్‌గా ఎన్నికైన బండిసూల సిద్దయ్య మంగళవారం మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రఘురామిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి, నాణ్యమైన విద్యా సౌకర్యాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

​ఈ కార్యక్రమంలో దువ్వూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి, మాజీ ఉప మండల అధ్యక్షుడు సంఘన లక్ష్మీనారాయణ రెడ్డి, నూర్ బాషా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియు మాజీ సర్పంచ్ నొస్సం పెద్ద దస్తగిరి, పార్టీ నాయకులు ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, భూమిరెడ్డిపల్లె రామకృష్ణ రెడ్డి, భూమిరెడ్డి కొండారెడ్డి, భూమిరెడ్డిపల్లె వెంకట శివారెడ్డి, జయన్నలతో పాటు చల్లబసాయిపల్లె గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ విభాగం నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR