Mydukuru: అమ్మవడి ఆశ్రమానికి చాపాడు తహసీల్దార్ నిత్యావసరాల సాయం!
Mydukuru: మైదుకూరు ‘అమ్మవడి’ అనాథ ఆశ్రమానికి చాపాడు తహసీల్దార్ రమా కుమారి 5 ప్యాకెట్ల బియ్యం అందజేసి, పిల్లలకు సాయం అందించాలని కోరారు.
Mydukuru: అమ్మవడి ఆశ్రమానికి చాపాడు తహసీల్దార్ నిత్యావసరాల సాయం!
Mydukuru: అనాథ పిల్లలను ఆదుకుంటూ వారికి అండగా నిలుస్తున్న ‘అమ్మవడి’ అనాథ ఆశ్రమానికి పలువురు దాతలు, రెవెన్యూ ఉద్యోగులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. రెవెన్యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం నిర్వహణకు ఉద్యోగులు, దాతలు సహకరిస్తూ అనాథ పిల్లల సంక్షేమానికి తోడ్పడుతున్నారు.
ఈ క్రమంలో చాపాడు తహసీల్దార్ రమాదేవి అమ్మవడి అనాథ ఆశ్రమాన్ని సందర్శించి, పిల్లల అవసరాల కోసం ఐదు ప్యాకెట్ల బియ్యాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ అమ్మవడి ఆశ్రమానికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు.
అనాథ పిల్లల సంక్షేమం కోసం ముందుకొచ్చి సహాయం అందించిన తహసీల్దార్ రమా కుమారి కి రెవెన్యూ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు దాతలు, ఉద్యోగులు మరింత సహకారం అందించాలని వారు కోరారు.




