Chinnamandem: మంత్రి మండిపల్లికి జిల్లా జర్నలిస్టు మహాసభల ఆహ్వానం!

Chinnamandem: చిన్నమండెంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జర్నలిస్టు సంఘాల నేతలు. ఈనెల 23న మదనపల్లెలో జరగబోయే జిల్లా మహాసభలకు ఆహ్వానం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 3 Aug 2026 3:05 PM IST
Chinnamandem
X

Chinnamandem: మంత్రి మండిపల్లికి జిల్లా జర్నలిస్టు మహాసభల ఆహ్వానం!

చిన్నమండెం: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం, పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన స్వగృహంలో ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF).

ఆంద్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మర్యాద పూర్వకంగా కలిసి ఈనెల 23 వ తేదీన మదనపల్లిలో జరగబోవు అన్నమయ్య జిల్లా మహాసభలకు ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో APWJF అధ్యక్ష కార్యదర్శులు రమేష్ రాయల్, హిదాయతుల్లా (అప్పా), APBJA అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ప్రసాద్,రమేష్ బాబు, రాష్ట్ర నాయకుడు షేక్ సలీమ్ బాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆది నారాయణ, రవిప్రకాష్ రాజు, షేక్. అస్లాం, నవాజ్ షరీఫ్, రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story